రాష్ట్ర మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం

  • March 19, 2022 4:01 pm

సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అన్ని శాఖల మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ కవిత, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌తోపాటు ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాపరమైన అంశాలు, నియామకాలు, వ్యవసాయం, ముందస్తు ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.


Connect with us

Videos

MORE