హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీల అభివృద్ధితోపాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది.
ఇదిలాఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా ఫోటానిక్ కార్పొరేషన్ మధ్య ఈరోజు ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో ఫోటానిక్ వ్యాలీ నిర్మాణానికి ఇదే మొదటి ఒప్పందం. సీఎం కేసీఆర్, ఫోటానిక్ సీఈవో రాజ్ దత్ సమక్షంలో అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు.