mt_logo

ప్రాణహిత-చేవెళ్ళపై సీఎం కేసీఆర్ సమీక్ష..

బుధవారం సచివాలయంలో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు మూడుగంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రాణహిత-చేవెళ్ళ సీఈ హరిరాం, వ్యాప్కోస్ సీఈ శంభు ఆజాద్, రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గతంలో సీమాంధ్ర సర్కారులన్నీ తెలంగాణ ప్రాజెక్టులను వీలైనంత అడ్డుకునే ప్రయత్నం చేశాయని, అందుకే అంతర్రాష్ట్ర వివాదాల నడుమ నలిగిపోతున్నాయని అన్నారు.

తెలంగాణను సస్యశ్యామలం చేయడంలో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందని, కాళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మాణం ద్వారా మిడ్ మానేరుకు నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, దానికి సంబంధించి పూర్తి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) సిద్ధం చేసి తీసుకురావాలని వ్యాప్కోస్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *