mt_logo

పీయూష్ గోయ‌ల్‌పై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పీయూష్ గోయ‌ల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయ‌న‌కు రైతుల‌పై ఏమైనా అవ‌గాహ‌న ఉందా? అని ప్ర‌శ్నించారు. పీయూష్ గోయ‌ల్ మీరు ఇంత సంస్కార‌హీనంగా ఎలా మాట్లాడారు. మా రైతుల‌ను, మంత్రుల‌ను అవ‌హేళ‌న చేశార‌ని కేసీఆర్ నిప్పులు చెరిగారు. తాము దేశంలో భూకంపం సృష్టిస్తామని, పీయూష్ గోయ‌ల్ ప‌రుగులు తీయాల్సిందేన‌ని హెచ్చ‌రించారు. హిట్ల‌ర్, నెపోలియ‌న్ వంటి అహంకారులు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిల‌దీశారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. కేంద్ర మంత్రి తెలంగాణ రైతుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు చాలా బాధ‌క‌ర‌మైన‌వి. పీయూష్ గోయ‌ల్ తెలంగాణ అన్న‌దాత‌లు నూక‌లు తినాల‌ని చెప్పారు. మేమైనా గోయ‌ల్ వ‌ద్ద అడుక్కోవ‌డానికి వ‌చ్చామా? పీయూష్ గోయ‌ల్ కాదు.. పీయూష్ గోల్ మాల్ అని విమ‌ర్శించారు. దేశ వ్యాప్తంగా ఎక్క‌డా లేనంత‌గా 30 ల‌క్ష‌ల బోర్లు తెలంగాణ‌లో ఉన్నాయి. మోటార్, విద్యుత్ తీగ‌లు, బోర్ల కోసం వేల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని తెలిపారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో తెలంగాణ‌లో సాగు రంగం తీవ్ర నిర్ల‌క్ష్యానికి గురైంద‌న్నారు. స్వ‌రాష్ట్రంలో వ్య‌వ‌సాయాన్ని పండుగ చేశామ‌న్నారు. రైతు ఏడ్చిన రాజ్యం ఏది బాగుప‌డ‌లేదు. ధాన్యం సేక‌ర‌ణ‌కు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *