పవిత్ర రంజాన్ నెల ప్రారంభం అయిన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెలవంక దర్శనం తర్వాత నెల రోజులపాటు ముస్లింలు చేసే ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రత ఉంటుందని, ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు అన్నీ శుభాలే జరగాలని సీఎం ఆకాంక్షించారు.
రంజాన్ పండుగ సందర్భంగా జూలై నెల సరుకుల్లో గోధుమలు రెండు కిలోలు, చక్కెర కిలో అందించేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కమిషనర్ రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బీపీఎల్ కుటుంబాలందరికీ ఇది వర్తిస్తుందని ఆయన చెప్పారు.