సమీక్షా సమావేశం నిర్వహించనున్న సీఎం కేసీఆర్

  • August 17, 2020 1:32 pm

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండడంతో జనజీవితం స్తంభించిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు పరిస్థితిని సీఎం సమీక్షిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చెరువులు, కుంటలు భారీ వర్షాలతో నిండడంతో జిల్లాలలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. ఇదిలా ఉండగా రాబోయే మూడు, నాలుగు రోజులపాటు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను అప్రమత్తం చేశారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి ఈరోజు మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎస్, రాష్ట్ర డీజీపీ, విద్యుత్, జలవనరుల శాఖ, మున్సిపల్, పంచాయితీ రాజ్, వ్యవసాయ, ప్రకృతి విపత్తు నివారణ శాఖల అధికారులు పాల్గొంటారు.


Connect with us

Videos

MORE