తెలంగాణ వైద్య రంగంలో ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్న అద్భుత ఘట్టం నేడు జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో మంగళవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రికేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి వర్చువల్‌గా ఒకేసారి తరగతులను ప్రారంభించనున్నారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ తొలి విద్యాసంవత్సరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ కలను సాకారం చేసే దిశగా అతిపెద్ద అడుగు పడబోతున్నది. ఈ 8 కాలేజీలతో అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
ప్రతి జిల్లాకు ఒక కాలేజీ : సీఎం కేసీఆర్