రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు రూ. 20 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని, దశలవారీగా రాష్ట్రంలోని చెరువులన్నిటినీ పునరుద్ధరిస్తామని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ అని పేరు పెట్టామని, కాకతీయుల స్ఫూర్తిగా చెరువుల పునరుద్ధరణ చేపడతామని చెప్పారు. నీటి లభ్యత పెంచడం కోసమే చెరువుల పునరుద్ధరణ అని, తెలంగాణలో చిన్న నీటివనరులు ఎక్కువగా ఉన్నాయని, నిరుపయోగంగా ఉన్న భూమిని సాగులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హరీష్ రావు తెలిపారు.