mt_logo

తెలంగాణ అడ్డుకోవడానికి బాబు దేశమంతా తిరిగాడు- హరీష్ రావు

తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాస్ కాకుండా దేశమంతా కాలుగాలిన పిల్లిలా తిరిగాడని, తెలంగాణను అడ్డుకోవడానికి కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే తక్కువని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. వరంగల్ సభలో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చాడని, ప్రసంగమంతా అబద్దాల పుట్ట అని విమర్శించారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై హరీష్ రావు నిప్పులుచెరిగారు. పదవికోసం మామ మీద చెప్పులేసిన ఘనత బాబుదేనని, ఎన్టీఆర్ అల్లుడు కాకపోతే నిన్ను చూసే నాథుడే లేడని, 9 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలనైనా మంజూరు చేయలేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించింది నీవు కాదా? అని, తెలంగాణపై మాట మార్చినందుకే వేలమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరవీరుల గురించి బాబు మాట్లాడటం చూస్తే పిల్లి ఆత్మ కోసం ప్రార్ధించినట్లు ఉందని, తెలంగాణను అడ్డుకోలేదని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తావా ? అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *