mt_logo

పచ్చి అబద్ధం ఆడి అడ్డంగా దొరికిన సి. నరసింహారావు

By: సవాల్ రెడ్డి, హైదరాబాద్

తెలంగాణా పైన సమైక్యాంధ్రవాదులు చేస్తున్న దుష్ప్రచారాలు అన్నీ ఇన్నీ కావు. ఒక పద్దతి ప్రకారం తెలంగాణావాదంపై దుష్ప్రచారం చేయడం చాలా కాలంగా జరుగుతూ వస్తున్నది. ఒక సమైక్యాంధ్ర “మేధావి” బాజాప్తాగా చేస్తున్న దుష్ప్రచారం ఒకటి ఇప్పుడు సాక్ష్యాలతో సహా దొరికింది.

సి. నరసింహారావు, ఉరఫ్ చల్లగుల్ల నరసింహారావు టీవీ రెగ్యులర్ గా చూసే వారికి ఈ పేరు పరిచయమే. తెలంగాణా అంటేనే ఒంటి కాలి మీద లేచే ఈయన గారంటే N-TV- కొమ్మినేనికి, TV5 తదితర సీమాంధ్ర ఛానెళ్లకు ఎంతో ఇష్టం. పొద్దున్నే టీవీల్లో వచ్చే వార్తల విశ్లేషణ కార్యక్రమంలో ఈ విశ్లేషకుడు ఏదో ఒక టీవీలో సమైక్యాంధ్ర వాదన పట్టుకుని ప్రత్యక్షమై పోతాడు.

తెలంగాణ విషయంలో మేము తటస్థం అనే పైకి చెప్పి లోపల మాత్రం సమైక్యాంధ్రకు కొమ్ముకాసే లోక్ సత్తా అనే పార్టీకి ఈ విశాలాంధ్రవాది ఒక గౌరవ సలహాదారు కూడా.

తెలంగాణ ఉద్యమంపై నోరుతెరిస్తే అబద్దాల దబాయింపు చేసే సదరు సి. నరసింహారావు చెప్పే కబుర్లలో నిజానిజాలేమిటో ఈ ఉదాహరణ నిరూపిస్తుంది.

నరసింహారావు గారు 2010 ఆగస్ట్ 26 న సాక్షి దినపత్రికలో ఒక వ్యాసం రాశారు. అపుడు తెలంగాణా ఉద్యమకారులు నిజాం పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్ 17వ తేదీని (కర్నాటక, మహారాష్ట్రల్లో) జరుపుతున్నట్టు విమోచన దినంగా జరపాలని ఆందోళన చేస్తున్నారు. ఆరోజును విమోచన దినంగా ప్రకటిస్తే సీమాంధ్ర ప్రజలకు వచ్చే నష్టం కూడా ఏమి లేదు.

కానీ తెలంగాణా ఉనికిని కూడా భరించలేని నరసింహారావు వంటి సూడో మేధావులు యధాప్రకారం దుష్ప్రచారం మొదలుపెట్టారు.

అందులో భాగంగానే నరసింహారావు విమోచన మీద అవాకులు చెవాకులు పేలుతూ సాక్షిలో వ్యాసం రాశారు. ఆ పత్రిక వాళ్ళు ఈ అబద్ధాలకోరు వ్యాసాన్నిమహాప్రసాదంగా వేశారు. అందులో ఆయనగారు “తెలంగాణా వాదులు అబద్దాలు చెబుతున్నారు…అసలు ఎలాంటి విమోచనా దినాలు కర్ణాటకలో గాని, మహారాష్ట్రలో గాని జరగడం లేదు పొమ్మన్నారు …అంతా అబద్దమేనని నిర్ధారణ చేసేశారు.

ఆయన రాసిందేమిటో చదవండి:

అయితే అనేక సంవత్సరాలుగా అటు కర్నాటక , ఇటు మహారాష్ట్ర లోనూ విమోచన ఉత్సవాలు జరుగుతున్నాయి. “హైదరాబాద్ -కర్నాటక విమోచన్ దినం” పేరిట కన్నడ జిల్లాలు గుల్బర్గా, రాయచూర్ లో, మరాట్వాడ ముక్తి సంగ్రాం దినం పేరిట మరాఠీ జిల్లాలు నాందేడ్, ఔరంగాబాద్లలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలకు సాక్షాత్తు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతూ వస్తున్నారు.

ఇందుకు సంబంధించి 2011 సంవత్సరం సెప్టెంబర్ 18 నాటి పత్రికల క్లిప్పింగులు కింద ఇస్తున్నాం. (ఇందులో సాక్షి కర్నాటక, మహారాష్ట్ర ఎడిషన్ పత్రికల కటింగ్ లు కూడా ఉన్నాయి. ఆ పత్రికే ఈ ఉత్సవాలు జరగటం లేదంటూ రాసిన వ్యాసం ప్రచురించడం వింతల్లో వింత.)

సీమాంధ్ర విశ్లేషకుల అబద్దాల ప్రచారానికి ఇదో మచ్చు తునక.

ఇపుడిది చూసి సి నరసింహారావు రావు ఏం జవాబు చెబుతారో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *