కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకులు కుమారస్వామి పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో కలిసి పని చేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో తప్పకుండా ప్రభావం చూపుతుందన్నారు. దేశమంతటా తెలంగాణ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని కుమారస్వామి అన్నారు. నిన్న తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ సర్వ సభ్య సమావేశానికి కుమారస్వామి హాజరైన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా జరిగిన పార్టీ సమావేశానికి పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు పలు రాష్ట్రాలకు పలువురు నాయకులు పాల్గొని బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు.