mt_logo

పీఏసీ సమావేశం నుండి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తొలి సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని మంత్రి శ్రీధర్ బాబును నిలదీశారు.

పీఏసీకి ఎన్ని నామినేషన్‌లు వచ్చాయని ప్రశ్నించిన బీఆర్ఎస్ సభ్యులు.. సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వాకౌట్ చేసిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ అన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నిటికి స్పీకర్ విచక్షణ అధికారం అని సమాధానం చెప్తున్నారు.2018లో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎంఐఎం కాబట్టి అక్బరుద్దీన్‌కు పీఏసీ ఛైర్మన్ ఇచ్చాం అని తెలిపారు.

గాంధీకి మా పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వలేదు.. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైంది.. గాంధీ నామినేషన్ ఎలా వచ్చింది అని అడిగారు.

పీఏసీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైనది. ప్రతీ రూపాయిని ప్రజల పక్షాన పీఏసీ ఆడిట్ చేస్తుంది. అపోజిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. మా సంఖ్య ప్రకారం 5 పేర్లు ఇవ్వమన్నారు.. ఇచ్చాం. కానీ అందులో గాంధీ పేరు లేదు అని స్పష్టం చేశారు.

2014లో కాంగ్రెస్‌కు పార్లమెంట్‌లో ప్రతిపక్ష హోదా లేదు.. అయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు. పార్లమెంట్ పీఏసీ ఛైర్మన్‌గా కేసీ వేణుగోపాల్‌ను చేశారు.. రాహుల్ గాంధీ సూచన మేరకే ఇది జరిగింది అని గుర్తు చేశారు.

2014లో కాంగ్రెస్‌కే పీఏసీ పదవి ఇచ్చాం. 2018లో కాంగ్రెస్ కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంఐఎంకు ఉన్నారు.. అందుకే వారికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చాం. 2018లో పీఏసీ ఛైర్మన్ పదవి శ్రీధర్ బాబు అడిగారనేది అవాస్తవం అని పేర్కొన్నారు.

మా ప్రశ్నలకు పీఏసీ సమావేశంలో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు.. అందుకే బాయికాట్ చేశాం  స్పీకర్ స్పందించడం లేదు.. అన్ని శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు అని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.