mt_logo

బీఆర్ఎస్ అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైంది: కేటీఆర్

బీఆర్ఎస్ అంటే భారత “రైతు” సమితి అని మరోసారి రుజువైంది.
జై కిసాన్ అనేది మాకు కేవలం ఓ నినాదం కాదు.. మా ప్రభుత్వ విధానం అని మరోసారి తేలిపోయింది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా బీజేపీ సర్కారు అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు సృష్టించినా రైతు రుణమాఫీని సంపూర్ణంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సంకల్ప బలానికి నిలువెత్తు నిదర్శనం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు

రైతు సంక్షేమంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అని రైతుకు రక్షణ కవచంగా అమలుచేసిన ప్రతి పథకం వ్యవసాయ రంగ చరిత్రపై చెరగని సంతకమని మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయం అంటే సంక్షోభం కానీ.. ఒక్క తెలంగాణలోనే వ్యవసాయం అంటే సంతోషమని కేటీఆర్ తెలియచేశారు.