mt_logo

తెలంగాణకు మరో అంతర్జాతీయ సంస్థ… హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లో మరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. జర్మనీకి చెందిన ప్రముఖ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ కంపెనీ బాష్ (BOSCH)… హైదరాబాద్ లో తమ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ బాష్ కంపెనీ హైదరాబాద్ కు రావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ‘‘జర్మన్ ఎంఎన్సీ అండ్ మొబిలిటీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, హోం అప్లియన్సస్ లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న బాష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ తన R&D కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఈ ప్రతిపాదిత కేంద్రంతో దాదాపు 3000 మంది యువతీయువకులకు ఉపాధి లభిస్తుంది.’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *