గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌ను సాహినాయత్ గంజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు క్రమంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద, గోషామహల్లో భారీగా పోలీసులు మోహరించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలో ప్రముఖ కమెడియన్ మునావర్ ఫారూకి షో జరిగింది. దీనిపై రాజాసింగ్ ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేస్తూ… హిందువుల మనోభావాలను మునావర్ కించపరిచినట్లు పేర్కొన్నారు. అయితే, ఆ వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఓ వర్గానికి చెందిన పలువురు నగర పరిధిలోని పలు స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి నగరంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెంటనే రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేశారు. ఇంతకు ముందు మునావర్ షోను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించినపుడూ పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
- One project, several questions: Musi beautification project’s scope remains murky
- 25 trips to Delhi in 10 months: Revanth sets a new record
- Congress govt hell-bent on Damagundam radar station while other countries dismantling similar projects
- Who is the ‘Big Brother’ protecting Telangana Congress leaders from ED?: KTR
- Is Meinhardt replicating Pakistan’s failed model for the Musi Beautification Project?
- 10 నెలల్లో రేవంత్ చేసిన రూ. 80,500 కోట్లు అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్ళింది?: కేటీఆర్
- కేటీఆర్ స్ఫూర్తితో పేదింటి విద్యార్థిని మెడిసిన్ చదువుకు మరో ఎన్నారై అండ
- విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది: కేటీఆర్
- సిగ్గు.. సిగ్గు.. గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా?: కేటీఆర్
- రూల్స్ మార్చి పోలీసుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుంది: హరీష్ రావు
- కేటీఆర్ స్ఫూర్తితో పేద వైద్య విద్యార్థికి అండగా నిలిచిన ఎన్నారై వెంకట్
- వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతర్థానం: కేటీఆర్
- నిర్దోషిగా బయటికి రాగానే ప్రొఫెసర్ సాయిబాబా మరణించడం శోచనీయం: హరీష్ రావు
- కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరు?: కేటీఆర్
- మండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధం: హరీష్ రావు