బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే రాజాసింగ్ ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజాసింగ్కు పాత కేసుల్లో పోలీసులు నోటిసులిచ్చారు. 41ఏ సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులిచ్చారు. రెండు రోజుల క్రితం మహ్మద్ ప్రవక్తపై, ఇస్లాం మతంపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావడం.. పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండు విధించింది. అయితే పోలీసులు ఆయన అరెస్టులో నిబంధనలు పాటించలేదంటూ రాజాసింగ్ న్యాయవాది కోర్టు దృష్టికి తేవడంతో.. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండడం, నిరసనల సెగ ఢిల్లీ దాకా తాకడంతో బీజేపీ అప్రమత్తమైంది. ఆయన్ను పార్టీ బాధ్యతల నుంచి తప్పించడమే కాక సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్