mt_logo

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌ను సాహినాయత్‌ గంజ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు క్రమంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద, గోషామహల్‌లో భారీగా పోలీసులు మోహరించారు. వివరాల్లోకి వెళితే.. నగరంలో ప్రముఖ కమెడియన్‌ మునావర్‌ ఫారూకి షో జరిగింది. దీనిపై రాజాసింగ్‌ ఓ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేస్తూ… హిందువుల మ‌నోభావాల‌ను మునావ‌ర్ కించ‌ప‌రిచిన‌ట్లు పేర్కొన్నారు. అయితే, ఆ వీడియోలో మహమ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ ఓ వర్గానికి చెందిన పలువురు నగర పరిధిలోని పలు స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి నగరంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెంటనే రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదుల మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేశారు. ఇంతకు ముందు మునావర్‌ షోను అడ్డుకుంటామని రాజాసింగ్‌ హెచ్చరించినపుడూ పోలీసులు ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *