అనకాపల్లి పట్టణంలో శుక్రవారం తమ పార్టీ ఆఫీసులో సమావేశం జరుపుకుంటున్న బీజేపీ నాయకులపై సమైక్యాంధ్ర గూండాలు దాడి చేశారు. తెలంగాణ ఏర్పాటుకు మద్ధతు పలుకుతారా అంటూ రెచ్చిపోయిన అల్లరిమూకలు బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కంభంపాటి హరిబాబు పై కోడిగుడ్లతో దాడిచేశారు. ఆయన కారు అద్దాలు పగులగొట్టారు.
పోలీసులు అతికష్టం మీద హరిబాబును సమైక్య గూండాల బారినుండి రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
బీజేపీ నాయకులపై దాడికి నాయకత్వం వహించింది స్థానిక వైకాపా నాయకుడు దాడి జయవీర్. ఈయన మాజీ మంత్రి వీరభద్ర రావు కుమారుడు. విశేషం ఏమిటంటే గతంలో మద్యం మత్తులో మహాత్మా గాంధీ, సరస్వతి దేవి, పొట్టి శ్రీరాముల విగ్రహాలు ధ్వంసం చేసింది కూడా ఇతగాడే. అప్పుడు తండ్రి జోక్యంతో కేసుల నుండి బయటపడ్డాడు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నందుకు సీమాంధ్రలో ఇప్పటికే అనేక బీజేపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. సమైక్యాంధ్ర ఆందోళనల్లో పెరుగుతున్న అరాచకత్వానికి తాజా దాడి ఒక నిదర్శనం.