mt_logo

ఎన్డీఏ ప్రభుత్వమా ఎన్పీఏ ప్రభుత్వమా : మంత్రి కేటీఆర్ ఫైర్

మంగళవారం సోషల్ మీడియా వేదిక‌గా రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కేటీఆర్ … కేంద్ర స‌ర్కార్ విధానాల‌పై మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరింద‌ని, గ‌డిచిన 45 ఏళ్ల‌లో లేనంత‌గా నిరుద్యోగం ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఇంత ద‌య‌నీయ పాల‌న కొన‌సాగిస్తున్న ఈ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎన్డీఏ ప్ర‌భుత్వం అని పిలువాలా లేక ఎన్పీఏ ప్ర‌భుత్వం అని పిలువాలా అని ఆయ‌న అన్నారు. మోదీ స‌ర్కార్ ఆయ‌న భ‌క్తుల‌కు ఎన్పీఏ(నాన్ ప‌ర్ఫార్మింగ్ అసెట్‌) అని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో విమ‌ర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ‌శాఖ రిలీజ్ చేసిన డేటాను విశ్లేషిస్తూ ఓ ఆంగ్ల ప‌త్రిక రాసిన క‌థ‌నాన్ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణం 30 ఏళ్ల గ‌రిష్టానికి చేరిన‌ట్లు ఆరోపించారు. ఇంధ‌న ధ‌ర‌లు కూడా దేశంలో ఆల్ టైమ్ హైకి చేరిన‌ట్లు మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. ఎన్డీఏ ప్ర‌భుత్వం ఇంధ‌న ధ‌ర‌ల‌ను నియంత్రించ‌లేక‌పోయింద‌న్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేనంత‌గా ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు. వినియోగ‌దారుల విశ్వాసం అత్య‌ల్ప స్థాయికి ప‌డిపోయిన‌ట్లు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక‌ను మంత్రి ప్ర‌స్తావిస్తూ మోదీ ప్ర‌భుత్వాన్ని త‌ప్పుప‌ట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *