మునుగోడులో ఓటమి ఖాయమని తేలిపోవటంతో బీజేపీ శ్రేణులు గుండాయిజానికి దిగారు. మునుగోడు మండలం పలివెలలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోకు వెళ్తున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ గూండాలు రాళ్లతో, కర్రలతో దాడులకు దిగారు. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోనే జరిగినట్టు భావిస్తున్న ఈ దాడిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ జగదీశ్ సహా పలువురి కార్యకర్తలకు గాయాలయ్యాయి.
మునుగోడు మండలం పలివెలలో టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గూండాలు చేసిన దాడిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, తెరాస కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. 25 రోజులుగా తెరాస ప్రచారం నిర్వహిస్తున్న ఎవరి మీద భౌతిక దాడులు చేయలేదని, బీజేపీ నేతలు, శ్రేణులకు ఓడిపోతున్నామని తెలిసే ఇలా రెచ్చగొడుతున్నారని, కాని టీఆర్ఎస్ ను గెలిపించి, వాళ్లకు ఓటుతో బుద్ది చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.