దుబ్బాక ఉపఎన్నిక బీహార్ ఎన్నికలతో పాటే!!

  • September 4, 2020 7:07 pm

బీహార్ శాసనసభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల శాసనసభల్లో 64 స్థానాలు, 1 లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అయితే అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తెలిపింది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ నవంబర్ 29వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీకి అక్టోబర్-నవంబర్ లలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సమాయత్తమవుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్, వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది. కోవిడ్-19, అధిక వర్షాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.

ఇదిలాఉండగా మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అందువల్ల దుబ్బాక నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనుంది. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి, రాష్ట్ర ఆర్ధికమంత్రివర్యులు హరీష్ రావు ఇప్పటికే పార్టీ అభ్యర్ధి విజయానికి కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలంతా కీర్తిస్తున్నారని, ఎన్నికలు ఏవైనా విజయం తమదేనని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


Connect with us

Videos

MORE