రేపు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన

  • October 22, 2021 4:13 pm

తెలంగాణ యొక్క విలక్షణమైన సంస్కృతి గొప్పతనాన్ని విశ్వవేదికపై చాటేందుకు పువ్వుల పండుగ బతుకమ్మ సిద్ధమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శనివారం (23వ తేదీ)న ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయిలోని బూర్జ్ ఖలీఫాపై, బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శనివారం రాత్రి 9.40 నిముషాలకు ఒకసారి మరియు 10.40 నిముషాలకు ఒకసారి బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన చేయనున్నారు. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే స్క్రీన్ ప్రపంచంలోనే అతి పెద్దది కావడం మరో విశేషం. ఒకేసారి దేశ, విదేశాలకు చెందిన లక్ష మందితో పాటు, దుబాయ్ ప్రభుత్వ అధికారులు, నాయకులు బూర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మను వీక్షించనున్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


Connect with us

Videos

MORE