mt_logo

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సి లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా శాఖ, విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకలకు నిజామాబాద్ పార్లమెంట్ సబ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు.

ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ వేడుకలకు అమెరికాలోని వర్జీనియా, డీ సి, మేరీలాండ్, డెలావేర్ రాష్ట్రాల నుండి ప్రజలు భారి సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా శాఖ కార్యనిర్వహణ అద్యక్షులు బండారు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సుమంత్, విజన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు విజయ్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జగదీష్ బొందుగుల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *