టొరంటోలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

  • October 12, 2021 10:09 pm

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటో నగరంలో తెలంగాణ వాసులతో శనివారం వర్చువల్ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట దీప గజవాడ, జ్యోతి, ఉష, హారతి,కీర్తి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేయగా, అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ ఈద ఆధ్వర్యంలో వర్చువల్ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిధిగా సినీ రచయిత, కవి, నటుడు తనికెళ్ళ భరణి గారు తన సందేశాన్ని తెలియజేసారు. “బతుకమ్మ పండుగను అత్యంత ఉత్సాహంగా, భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకొంటూ, మన సంప్రదాయాలను భావితరాలకు అందజేయటం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సురభి డ్రామా థియేటర్ వారిచేత ‘బతుకమ్మ బుర్రకథ’ మరియు జయానంద్ బృందం చేత ‘పాతాళభైరవి’ నాటకాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసాయి. ఈ వర్చువల్ బతుకమ్మ ఉత్సవాలను కల్చరల్ టీం సభ్యులు ఐదు గంటల పాటు ఉత్సాహంగా సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వేణుగోపాల్ రోకండ్ల, బోర్డ్ ట్రస్టీ చైర్మన్ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, జనరల్ సెక్రటరీ దామోదర రెడ్డి మాది, కల్చరల్ సెక్రెటరీ కవిత తిరుమలాపురం మరియు ఇతర కార్యవర్గ సభ్యులతో పాటు టెక్నీకల్ టీం పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE