బుధవారం తెలంగాణ భవన్ లో విలేకరులతో సమావేశమైన టీఆర్ఎస్ ఉపనేత హరీష్ రావు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు తెలంగాణ ప్రాంతంలో రాజకీయాలు చేసే హక్కు లేదని, కేసీఆర్ ను విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోతున్నందుకు మతితప్పి మాట్లాడుతున్నాడని, టీడీపీ ఆవిర్భావం నుండే పార్టీలో కొనసాగిన కేసీఆర్ కు, కాంగ్రెస్ నుండి ఆలస్యంగా వచ్చిన చంద్రబాబు రాజకీయ గురువు ఎలా అవుతారని విమర్శించారు. సొంత మామను అధికారం కోసం వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను త్యాగం చేసిన కేసీఆర్ కు పోలికా? అని అన్నారు. అధికారం కోసం మామపై చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుదని, ప్రజల కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ పోరాటయోధుడు కేసీఆర్ అని చెప్పుకొచ్చారు. తనవల్లే ఐటీ పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందని అంటున్న చంద్రబాబు రేపట్నుంచీ దేశమంతా కూడా తనవల్లే ఐటీ వచ్చిందని చెప్పినా పెద్దగా ఆశ్చర్యం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా విషం చిమ్ముతూనే ఉన్న బాబును తెలంగాణ ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇకనైనా నీతి, నిజాయితీతో రాజకీయాలు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ టీడీపీ పార్టీ నేతలు టీఆర్ఎస్ లో చేరడానికి క్యూ కడుతున్నారని, సింగిల్ డిజిట్ కే టీడీపీ పార్టీ పరిస్థితి ఉందని తెలిసి తెలంగాణలో బీసీని సీఎం ను చేస్తాం, పేదవాడి రాజ్యం తెస్తామని రోజుకో మాట చెప్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు.
- NHRC takes cognizance of Lagacharla issue; seeks report from CS, DGP
- Pharma companies taking over fertile lands of tribals in Kodangal
- Congress govt. stops providing snacks to 10th students in special classes
- Congress govt. gears up to fleece citizens through LRS; aims to mint Rs. 10k cr
- Congress claims credit for ‘Kaloji Kalakshethram’ built by BRS govt.
- అదానీ అంశంలో చేతులెత్తేసిన రాహుల్.. రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
- రేవంత్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపుతున్నాడు: హరీష్ రావు
- ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా?: ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై హరీష్ రావు
- మహారాష్ట్ర ఫలితాల తర్వాత రేవంత్ సీఎం పదవి ఊడటం ఖాయం: దాసోజు శ్రవణ్
- కేసీఆర్ రైతు సీఎం అయితే రేవంత్ రెడ్డి బూతు సీఎం: హరీష్ రావు
- కేటీఆర్ని కలిసిన టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు
- లోడ్ పెరిగిందంటూ ట్రాన్స్ఫార్మర్ల భారం అపార్ట్మెంట్ వాసులపైన వేస్తారా?: కేటీఆర్
- లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు కాంగ్రెస్ సర్కార్ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
- లగచర్ల ఘటన తాలుకు సమాచారాన్ని కోరిన రాష్ట్రపతి కార్యాలయం
- విజయోత్సవాలు కాదు, అపజయోత్సవాలు జరపండి: కాంగ్రెస్కు హరీష్ రావు హితవు