mt_logo

అసెంబ్లీ సమావేశాలు:

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే సమైక్య తీర్మానం కోసం వైసీపీ సభ్యులు స్పీకర్‌ను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.వెంటనే తెలంగాణ నేతలు కూడా జై తెలంగాణ నినాదాలు చేయడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి శనివారం స్పీకర్‌కు ఇచ్చిన నోటీసుకు ప్రతిగా రూల్ 81కింద నోటీసును స్పీకర్‌కు ఇచ్చారు. ఈ రూల్ ప్రకారం స్పీకర్‌కు నోటీసును తిరస్కరించే అధికారం ఉంటుంది. మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి కూడా ఒక లేఖను స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందచేశారు. రూల్ 81కింద నోటీస్‌ను తిరస్కరించే అధికారం స్పీకర్‌కు ఉంటుందని తెలిపారు. సీఎం కిరణ్ రూల్77 కింద ఇచ్చిన నోటీస్ చెల్లదని స్పీకర్ ప్రకటించేంతవరకు సభను నడవనివ్వమని టిడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి స్పష్టం చేశారు. కాగా మంత్రి జానారెడ్డి ఇదే విషయంపై గవర్నర్‌కు ఒక లేఖను వ్రాశారు. సీఎం ఇచ్చిన నోటీస్ కేబినెట్ ఆమోదంతో పంపలేదని, దానిని పరిగణనలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాసేపటికి సభ ప్రారంభమైనా, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి జై తెలంగాణ, సీఎం డౌన్ డౌన్ అంటూ హోరెత్తించారు. స్పీకర్ ఎంత విజ్ఞప్తి చేసినా వారు తమస్థానాలకు వెళ్ళకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *