ఆనాడు మద్రాసు నుండి విడిపోయినప్పుడు ఆంధ్రకు దక్కింది విరిగిపోయిన కుర్చీలు, బల్లలు, చెడిపోయిన గడియారాలు మాత్రమేనట. ఆఖరికి మద్రాసు అసెంబ్లీలో మూడు మైకు యంత్రాలు ఉంటే ఒక్కటి కూడా ఆంధ్రులకు దక్కలేదట!
జనవరి 1, 1954 నాడు ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు పిల్లలమర్రి వెంకటేశ్వర్లు చేసిన ప్రసంగంలోని ఈ భాగాలు ఒకసారి చూడండి.
(ఆంధ్ర ప్రభ 2 జనవరి, 1954 నుండి)