mt_logo

త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు : మంత్రి హరీష్ రావు

అంబేద్కర్ ఆలోచనలను కొంత అయినా పాటించాలి.. అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలని సూచించారు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్‌రావు. సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్ళి గ్రామంలో 25 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం డైనింగ్ హాల్‌ని ప్రారంభించిన అనంతరం అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూఢ నమ్మకాల నుంచి ప్రజల్ని బయటకు తేవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచనలను కొంత వరకైనా పాటించాలి.. ఆయన స్ఫూర్తిలో మనం మన గ్రామానికి కొంత అయినా ఇవ్వాలన్నారు. ఇక, పేదరికం వల్లే మనుషుల్లో తేడా వచ్చిందన్నారు హరీష్‌రావు.. పేదరికాన్ని రూపు మాపాలని సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని తెచ్చారని గుర్తుచేశారు. మరోవైపు, విద్య, ఉద్యోగాల్లో, కాంట్రాక్ట్‌లలో కూడా రిజర్వేషన్‌ తెచ్చామని తెలిపారు. విద్యలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా అందించేందుకు రూ.7,300కోట్లతో మన ఊరు మన బడి పథకం తెచ్చామని తెలిపిన ఆయన.. రాష్ట్రంలో 13 వేల టీచర్‌ ఉద్యోగాలను త్వరలోనే భర్తీచేస్తామని వెల్లడించారు. ఇక, తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో బోధనా జరిగేలా చర్యలు చేపట్టామని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ లో 50 శాతం దళితులకు అవకాశం కల్పించామన్నారు. స్వాతంత్ర వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా కొన్ని గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలు లేవు, త్వరలోనే అన్ని గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు మంత్రి హరీష్‌రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *