తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం మరువలేనిదని, అమరుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించామని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, 459 మంది అమరవీరులకు ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల పరిహారం అందించనున్నామని చెప్పారు. ప్రజాధనం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించామని, సర్వేతో పథకాలలో జరిగే మోసాలను అరికడతామని, అర్హులకే పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈటెల స్పష్టం చేశారు.
ఆర్ధికమంత్రి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ విశేషాలు క్రింది విధంగా ఉన్నాయి.
మొత్తం బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు
ప్రణాళిక వ్యయం రూ. 48,648 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు
ఆర్ధికలోటు అంచనా రూ. 17,398 కోట్లు
ఎస్టీ ఉపప్రణాళికకు రూ. 4,559 కోట్లు
ఎస్సీ ఉపప్రణాళికకు రూ. 7, 579 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి రూ. 1,030 కోట్లు
బీసీ సంక్షేమానికి రూ. 2, 022 కోట్లు
కళ్యాణలక్ష్మి(ఎస్సీ) పథకానికి రూ. 150 కోట్లు
కల్యాణలక్ష్మి(ఎస్టీ) పథకానికి రూ. 80 కోట్లు
మహిళా, శిశు సంక్షేమానికి రూ. 221 కోట్లు
రుణమాఫీకి రూ. 4,250 కోట్లు
విద్యారంగానికి రూ. 10,956 కోట్లు
వైద్య, ఆరోగ్యరంగానికి రూ. 2,282 కోట్లు
వాటర్‌గ్రిడ్‌కు రూ. 2వేల కోట్లు
విలేకరుల సంక్షేమానికి రూ. 10 కోట్లు
9 వేల చెరువుల పునరుద్ధరణకు రూ. 2వేల కోట్లు
విత్తన భాండాగారం కోసం రూ. 50 కోట్లు
ఉద్యానవన పంటల కోసం రూ. 250 కోట్లు
కోళ్ళ పరిశ్రమకు రూ. 20 కోట్లు
బిందుసేద్యంకోసం రూ. 250 కోట్లు