mt_logo

సీఎం కేసీఆర్ తో భేటీ అయిన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. దాదాపు రెండుగంటలకుపైగా భేటీ కొనసాగింది. దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై చర్చించినట్లు సమాచారం. అఖిలేష్‌ యాదవ్‌ వెంట సమాజ్‌ వాది పార్టీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ ఉన్నారు. రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *