mt_logo

జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఏసీబీ డీజీ ఏకే ఖాన్..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా పలువురు ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సోమవారం ఉదయం సచివాలయంలో ఐటీ మంత్రి కేటీఆర్ ను కలిసి జూకల్ గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఏకే ఖాన్ ఈ విషయం తెలుపగానే మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *