రాష్ట్రంలో మరో 61 డయాలసిస్ కేంద్రాలు : మంత్రి హరీష్ రావు

  • April 15, 2022 1:56 pm

రాష్ట్రంలో పెరుగుతున్న కిడ్నీ బాధితుల అవసరాలకు అనుగుణంగా డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 515 డయాలసిస్ యంత్రాలతో 61 కేంద్రాలను మంజూరు చేస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి, సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ ఆసుపత్రి, హుస్నాబాద్‌లోని కమ్యూనిటి హెల్త్ సెంటర్, జగిత్యాల జిల్లా ధర్మపురి ఏరియా ఆసు పత్రి, రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డయాలసిస్ కేంద్రాలు మం జూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో ఐదు యంత్రాల చొప్పున అందుబాటులోకి తీసు కురానున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎంపిక చేసి న ఆయా కేంద్రాలలో విడతల వారీగా డయా లసిస్ కేంద్రాలను, యంత్రాలను ఏర్పాటు చేయ నున్నట్లు ఆయన ఇందుకు సంబం ధించి వెంటనే చర్యలు చేపట్టాలని వైద్యవిధాన పరిషత్ కమిషనర్, టిఎస్‌ఎంఐడిసి మేనేజింగ్ డైరెక్టర్‌లను ఆదేశించారు.


Connect with us

Videos

MORE