వక్ఫ్ భూములు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయని, వాటిని కాపాడటం తమ బాధ్యత అని శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తామని, హౌసింగ్ సొసైటీ అక్రమాలు, వక్ఫ్ భూముల మీద జాయింట్ హౌస్ కమిటీ వేయాలని, అవసరమైతే రెండు హౌస్ కమిటీలు వేసి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అంతేకాకుండా బంజారాహిల్స్ లో ఆదివాసీలకు, లంబాడీలకు 2 ఎకరాల్లో బంజారా హౌస్ లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని హౌసింగ్ సొసైటీలపై సభాసంఘం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అనంతరం స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ సభాసంఘాన్ని వేస్తున్నట్లు తెలిపారు.