mt_logo

హైదరాబాద్ లో 1500 కోట్లతో ఆయిల్ రిగ్గుల పరిశ్రమ : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌లో మ‌రో అంత‌ర్జాతీయ సంస్థ కొలువుతీరనుంది. 1500 కోట్ల పెట్టుబ‌డితో హైద‌రాబాద్‌లో గ్లోబల్‌ ఆయిల్‌ రిగ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ఏర్పాటు కానుంది. మేఘా ఇంజినీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) అనుబంధ సంస్థ.. ఇటలీకి చెందిన డ్రిల్‌మెక్‌స్పా రాష్ట్రంలో చమురు రిగ్గులు, దాని అనుబంధ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దీనిపై పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో సోమవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. డ్రిల్‌మెక్ ఏర్పాటుతో కొత్త‌గా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని డ్రిల్‌మెక్‌ స్పా కంపెనీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయిల్ రిగ్గుల త‌యారీలో అంత‌ర్జాతీయ స్థాయి సంస్థ‌ డ్రిల్‌మెక్‌… తెలంగాణ కేంద్రంగా భారీ ఆయిల్ రిగ్గుల‌ను త‌యారు చేయ‌నుంది. రాష్ట్రలో హైద‌రాబాద్‌ కేంద్రంగా డ్రిల్‌మెక్ తన కార్యకలాపాలను కొనసాగించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *