mt_logo

కేటీఆర్ కృషి వల్లే రాష్ట్రానికి 1500 కంపెనీలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషి వల్లే ఏడు లక్షల మంది కార్పొరేట్ సెక్టార్ లో ఉద్యోగాలు చేస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాజ్ డెక్కన్‌ హోటల్ లో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆద్వర్యంలో టీసీఎస్ ఐయాన్, టీఎస్ ఆన్లైన్ సహకారంతో ఉన్నత విద్యలో “ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయబిలిటీ” అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జయేష్ రంజన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్స్, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని మంత్రి సబితా రెడ్డి అన్నారు. లక్షల మంది విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకొని బయటికి వస్తున్నారన్నారు. ఐటీ పాలసీలు మార్చుతూ కేటీఆర్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని అన్నారు. కేవలం మంత్రి కేటీఆర్ కృషితో 1500 కంపెనీలు హైదరాబాద్ కి వచ్చాయని, తద్వారా 7 లక్షల మంది ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని వెల్లడించారు. అన్ని రంగాలు అభివృద్ధి చెందేలా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *