రాష్ట్రపతి పంపిన తెలంగాణ బిల్లుకు సంబంధించి సవరణలు, సూచనలు స్పీకర్ కు రాతపూర్వకంగా అందజేసామని టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు చెప్పారు. తెలంగాణ బిల్లులో సూచించిన సవరణలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. ఉమ్మడి రాజధాని కాలపరిమితి మూడేళ్ళకు మించి ఉండరాదు.
2. హైదరాబాద్ పై తెలంగాణ సీఎం అధికారం ఉండాలి.
3. శాంతిభద్రతల విషయంలో గవర్నర్ పెత్తనం ఉండరాదు. అలా చేస్తే తెలంగాణ ప్రజలకే అవమానం.
4. తెలంగాణ ఏర్పడగానే మూడునెలల్లో కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాలి.
5. స్థానికత ఆధారంగా ఉద్యోగులను, పెన్షనర్లను గుర్తించి సీమాంధ్ర పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ ను సీమాంధ్ర ప్రాంతమే భరించాలి.
6. తెలంగాణలో ఉత్పత్తయ్యే విద్యుత్ తెలంగాణకే ఇవ్వాలి.
7. ఆస్తుల ప్రాతిపదికన ప్రభుత్వరంగ సంస్థలను విభజించాలి.
8. తెలంగాణకు వెటర్నరీ యూనివర్సిటీ, ఏఐఐఎంసీ, ఐఐఎం, ఎన్టీపీసీ లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలి.
9. హెచ్ వోడీలు, జోనల్ గెజిటెడ్ ఆఫీసర్లు ఏ ప్రాంతంలో ఎక్కువ పనిచేస్తే ఆ ప్రాంతానికే పరిమితం చేయాలి.
10. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి.