తెలంగాణ రాష్ట్ర సమితి కారు జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ… ఆ పార్టీ ఫుల్ జోష్‌లో ఉంది. వరసగా వెలువడుతున్న మందస్తు సర్వేలు గులాబీ జెండాదే విజయం అని ఢంకా భజాయించి మరీ మోత మోగిస్తుండడం, అందులోనూ కాంగ్రెస్‌కి అనుకూలంగా వ్యవహరించే నేషనల్ మీడియా సైతం టీఆర్‌ఎస్‌కి పాజిటివ్ ఓటు ఉందని తేల్చి పారేస్తుండడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధీటైన నేత తెలంగాణలో మరొకరు లేరని సర్వేలు తేల్చి పారేస్తుండడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలలో ఊపు పెరిగింది.
ఇదే అదనుగా లక్షలాది మంది కార్యకర్తలు, వేలాదిమంది నేతలు తెలంగాణ భవన్‌వైపు పరుగులు పెడుతున్నారు. గులాబీ తీర్ధం పుచ్చుకోవడానికి సంసిద్ధులవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి పాతరేసిన గులాబీ దళపతి ఇక, ఇతర పార్టీలను సైతం తనవైపుకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక్క ఆదివారం నాడే ఏకంగా 11వేల మంది కార్యకర్తలు ఒకేసారి మూకుమ్మడిగా టీఆర్‌ఎస్ జెండా పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. వీరంతా గుజరాత్ మహాజన్ సభకు చెందిన వారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణ వ్యాప్తంగా నివసించే గుజరాత్ సమాజ్ ఓటర్లు 11వేల మంది ఉన్నారు. వీరంతా ఒకేసారి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటిదాకా ఏ పార్టీకి చెందని, తటస్థంగా ఉంటున్న వీరంతా హైదరాబాద్‌ని తమ నేటివ్ ప్లేస్‌గా, కాస్మోపాలిటన్ సిటీగా ఆవిష్కరించిన ఘనత కేసీఆర్, కేటీఆర్‌దే అని, అందుకే తమ అభిమాన నేతలకు అండగా టీఆర్‌ఎస్‌కే ఓటేయాలని నిర్ణయించుకున్నామని చెబుతున్నారు. అంతేకాదు, ఇకపై తాము టీఆర్‌ఎస్ కార్యకర్తలం అని, పార్టీ సభ్యత్వం తీసుకుంటామని ముందుకు వచ్చారు. వీరికి ఆదివారం పార్టీ అధినేత కేసీఆర్ కండువా కప్పి సభ్యత్వం ఇవ్వనున్నారు.. ఒకేసారి ఇలా వేలాది మంది పార్టీలో చేరడం ఓ రికార్డ్ అని, గతంలో ఏ పార్టీకి చెందలేదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.. వీరి రాకతో తెలంగాణ భవన్‌కి కొత్త కళ సంతరించుకోనుంది..