mt_logo

కాంగ్రెస్‌ అసమ్మతి జ్వాలలను ఆపే లీడర్‌ ఎక్కడ..? ఎవరు.. ?

టీ కాంగ్రెస్‌లో ముసలం పుట్టనుందా..? ఆ పార్టీలో చెలరేగబోయే అంతర్గత చిచ్చు చివరికి ఆ పార్టీనే ముంచనుందా…? గాంధీభవన్‌లో టికెట్‌లు దక్కని అసంతృప్త నేతలను చల్లార్చే సీన్‌ ఉన్న నేత ఎవరు..? పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెబితే వినే నాయకుడు ఒక్కరయినా ఉన్నారా..?? సీఎల్‌పీ లీడర్‌ జానా రెడ్డి కనుసైగ చేస్తే కదలకుండా సైలెంట్‌గా ఉండే నేత ఒక్కరిని చూపిస్తారా..? ఈ ప్రశ్నలకు సమాధానం ఊహించడం అంత కష్టమేమీ కాదు..

ఈ పరిణామాలన్నీ ఊహించిన అధిష్టానం టికెట్‌ల లొల్లిని మరింత లేట్‌ చేస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. ముందుగానే అసంతృప్తులను బుజ్జగించడాన్ని పెద్ద పనిగా పెట్టుకున్న కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఢిల్లీలోని ఆ పార్టీ వార్‌ రూమ్‌లో స్పెషల్‌ వింగ్‌ ఏర్పాటు చేసింది. టికెట్‌ రాని నేతలకు అక్కడకి పిలిపించి ఓదారుస్తున్నారు. అయితే, ఢిల్లీ నుండి హస్తిన వచ్చిన వెంటనే టికెట్ రాకపోతే ఎవరు ఎలా మారుతారో, ఏం చేస్తారో తెలియని పరిస్థితి.

ఇప్పటికే ఒక్కో టికెట్‌ కోసం ముగ్గురు నలుగురు వెయిట్‌ చేస్తున్నారు. ఏ ఒక్కరికి టికెట్‌ ఇచ్చినా మిగిలిన ఇద్దరు ముగ్గురు రెబల్స్‌గా మారడం ఖాయం. టీఆర్‌ఎల్‌లో టికెట్‌లు రాలేదని భావించిన నేతలను పిలిచి మాట్లాడి, మంతనాలు జరిపి, ఇటు కేటీఆర్‌, హరీశ్‌ వంటి నేతలను పంపి బుజ్జగించారు కేసీఆర్‌. కొందరికి భవిష్యత్‌పై ఆశలు కల్పించారు. మరికొందరికి ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ పదవులు కట్టబెడతానని హామీలు గుప్పించారు. అంతటితో ఆ నేతలంతా సైలెంట్‌ అయ్యారు.

మరి, కాంగ్రెస్‌లో ఈ మంటలను చల్లార్చే నేత ఎవరు…?? వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొలేకపోతే పార్టీలో చీలికలు, నియోజకవర్గంలో అసమ్మతులు పుట్టిముంచడం ఖాయం. వీటికోసమే అవతల కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వేచి చూస్తున్నారు. ప్రత్యర్ధి శిబిరానికి కావలసింది కూడా ఇదే.. మరి, ఆ నేతలు జానా చెబితే సైలెంట్‌ అవుతారా.? ఉత్తమ ఊ కొడితే ఆగిపోతారా.? ఇది చాలు.. కేసీఆర్‌కి కాంగ్రెస్‌ పళ్లెంలో పెట్టి రెండో సారి అధికారం అప్పగించడానికి….!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *