చంద్రబాబు రేపు పర్యటించనున్న వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఒక ఎస్పీ, 5 మంది ఐపీఎస్లు, ఏడుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, ఆర్పీఎఫ్ బలగాలు, 1000 మంది కానిస్టేబుళ్లు, 200 మంది మహిళా పోలీసులు, 500 మంది హోంగార్డులను ప్రభుత్వం మోహరించింది.
దీనికి తెదేపా నాయకుల ప్రైవేటు సైన్యం దాదాపు రెండు వేల మందితో కూడిన చంద్రదండు అదనం.
ప్రతిపక్ష నాయకుని యాత్ర విజయవంతానికి కిరణ్ ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. ఏదో ఒకలా చంద్రబాబు వరంగల్ పర్యటన అయ్యిందనిపించి ‘ఇదిగో తెలంగాణ ఉద్యమ ప్రభావం ఏమీ లేదని’ నిరూపించే ప్రయత్నం చేస్తోంది.
చంద్రబాబు పర్యటనను అటు పొలిటికల్ జే.ఏ.సి, ఇటు విద్యార్ధి, న్యాయవాదుల, డక్టర్ల జేయేసీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనితో వరంగల్ జిల్లా అంతటా పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.