mt_logo

కేసీఆర్‌కి అనుకూలంగా టైమ్స్‌నౌ సర్వే….!!

 

తెలంగాణ తీర్పు ఎలా ఉండబోతోంది..??? టీఆర్‌ఎస్‌ అధికారం నిలబెట్టుకోనుందా..?? కారు స్పీడ్‌కి బ్రేక్‌లు వేసి మహాకూటమి పవర్‌లోకి రానుందా….?? 2018లో ఎవరికి అధికారం ఎవరికి దక్కనుంది…? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారుతోంది. దీనిపై గత కొన్ని రోజులుగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ ఇమేజ్‌ డ్రాప్‌ అయిందని, టీఆర్‌ఎస్‌ జోరు తగ్గిందని, ఆ పార్టీ ఓటమి ఖాయమని కొందరు తేల్చిపారేస్తున్నారు. మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు.. అయితే ఇలాంటి వారికి షాక్‌ వచ్చింది టౌమ్స్‌ నౌ చానెల్‌.

తెలంగాణలో అధికారం మరోసారి టీఆర్‌ఎస్‌కే దక్కనుందని టైమ్స్‌ నౌ చానెల్‌ తేల్చిపారేసింది. ఈ పార్టీకి ఏకంగా 70 స్థానాలు దక్కుతాయని ప్రకటించింది. ఇక నాలుగు పార్టీల మహాకూటమికి కేవలం 33 స్థానాలే వస్తాయని లెక్కగట్టింది టైమ్స్‌ నౌ సర్వే.. ఇందులో కాంగ్రెస్‌కి మేజర్‌గా 31 స్థానాలు వస్తాయని తేల్చిపారేస్తుండగా, అదే టైమ్‌లో టీడీపీకి కేవలం రెండంటే రెండు స్థానాలే దక్కుతాయని వివరించింది ఈ చానెల్‌. అదే ఎమ్ఐఎమ్‌ 8 నియోజకవర్గాలు లభిస్తాయని తెలిపింది. బీజేపీ 3 స్థానాలలో పాగా వేయనుందని లెక్కగట్టింది.

నవంబర్‌ 12 – 18 మధ్య కాలంలో చేసిన ఈ సర్వేలో కారు జోరు స్పష్టంగా కనిపిస్తోందని వివరించింది.. గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కి 63 స్థానాలు రాగా, ఈ సారి అది 70కి పెరగనుంది. ఇక ఓట్‌ బ్యాంక్‌ కూడా గులాబీ దండుకి మరో నాలుగు శాతం పెరుగుతుందని టౌమ్స్‌ నై సర్వే చెబుతోంది.. పోలింగ్‌ నాటికి ఇది మరింత పెరిగే చాన్స్‌ ఉందని వారు అంచనా వేస్తున్నారు..

మరోవైపు, రాహుల్‌ – చంద్రబాబు పొత్తును తిరస్కరించినట్లు తేలిపోయిందనే వాదనని తెరపైకి తెస్తోంది టైమ్స్‌ నౌ. ఎన్నికలకు మరో 15 రోజులు సమయం కూడా లేదు. మొత్తమ్మీద, ఈ సర్వే మహాకూటమిని షేక్‌ చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. అయితే, కొంతమంది మాత్రం దీనిని ఫేక్‌ సర్వేగా కొట్టిపారేస్తున్నారు. దేశంలో బీజేపీకి అనుబంధంగా ఉన్న ఈ చానెల్‌ని కేవలం ఓటమి నుండి తప్పించుకోవడానికే ఈ సర్వేని తెరపైకి తెచ్చిందని ఎదురు దాడికి దిగుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. మరో పది హేను రోజుల్లో అధికారం ఎవరిదనేది తేలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *