తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు తనదైన శైలిలో ఉద్యమించే వేనేపల్లి పాండురంగారావు ఈసారి మరో విన్నూత్న ప్రయత్నం చేశాడు. సంక్రాంతి పండుగకు సీమాంధ్రకు వెళ్లి తిరిగివచ్చే వారికి అవగాహన కల్పించేందుకు 24 గంటల నిరసన దీక్షను “నిరాగ్రహం” పేరుతో నిర్వహించాడాయన.
NH-9 రహదారిపై ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు గ్రామం నల్లబండగూడెం వద్ద తెలంగాణ మట్టి మనుషుల వేదిక ఆధ్వర్యంలో వేనేపల్లి పాండురంగారావు ఈ దీక్షను నిర్వహించారు.
ఈ సందర్భంగా వేనేపల్లి మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు కుట్రలు పన్నొద్దని, విడిపోయేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జే.ఏ.సి, టీఆరెస్, బీజేపి నాయకులు పాల్గొన్నారు.