mt_logo

కెనడాలోని టోరొంటో నగరంలో ఘనంగా సంక్రాంతి పండుగ తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాలు

తెలంగాణ కెనడా సంఘం ఆధ్వర్యంలో 12 జనవరి 2019 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటోలోని పోర్టు క్రెడిట్ సెకండరి పాఠశాల ఆడిటోరియంలో 800 మందికి పైగా ప్రవాస తెలంగాణ వాసులు సంక్రాంతి పండుగ మరియు తీన్మార్ సాంస్కృతిక ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు.

ఈ పండుగ సంబురాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల ఆధ్వర్యంలో జరుగగా తెలంగాణ కెనడా అసోసియేషన్ ఫౌండేషన్ కమీటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసు తిరునగరి, ట్రుస్టీ బోర్డు అధ్యక్షులు శ్రీ హరి రావుల్, ఉపాధ్యక్షులు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం, కార్యదర్షి శ్రీ శ్రీనివాస్ మన్నెం, కోషాధికారి శ్రీ దామోదర్ రెడ్డి మాది, సాంస్కృతిక కార్యదర్షి శ్రీమతి దీప గజవాడ,  డైరెక్టర్లు శ్రీ మనోహర్ భొగా, శ్రీ  శ్రీనివాస్ చంద్ర, శ్రీమతి మంగ వాసం, శ్రీ మూర్తి కలగోని, శ్రీ గణేశ్ తెరాల, ట్రస్టీలు శ్రీ సురేశ్ కైరోజు, శ్రీ వేనుగోపాల్ రెడ్డి ఏళ్ళ, శ్రీ కిరణ్ కుమార్ కామిశెట్టి మరియు శ్రీ నవీన్ ఆకుల, ఫౌండర్లు శ్రీ కోటేశ్వరరావు చిత్తలూరి, శ్రీ చంద్ర స్వర్గం, శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ రాజేశ్వర్ ఈద, అథీక్ పాష , శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, కలీముద్దిన్, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ నవీన్ సూదిరెడ్డి, శ్రీ ప్రకాశ్ రెడ్డి చిట్యాల పాల్గొన్నారు.

ఈ సంక్రాంతి సంబరాలలో పిల్లలకు భోగిపండ్ల కార్యక్రమముతో ఆశీర్వదించారు మరియు సంస్థ నిర్వహించిన ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి శ్రీమతి అనుపమ పబ్బ గారు గెలుచుకున్నారు. ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యదర్షి శ్రీమతి దీప గజవాడ మరియు ఉపాధ్యక్షులు శ్రీ విజయకుమార్ తిరుమలాపురం ఆద్వర్యంలో మూడు గంటలపాటు చక్కటి సాంస్కృతిక కార్యక్రమములను నిర్వహించగా సభా సమయం మొత్తానికి ఆంకర్లుగా కుమారి మేఘ స్వర్గం మరియు శ్రీమతి హారిక నిర్వహించారు.

ఈ సందర్బంగా తెలుగు తిధిలతో కూడిన టోరొంటో సమయముతో అసోషియేషన్ 2019 క్యాలెండరును ఆవిష్కరించారు.

ఈ ఉత్సవాలలో తెలంగాణ కెనడా సంఘం అత్యంత రుచికరమైన భోజనాలను ఏర్పాటు చేసింది. చివరగా అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల వందన సమర్పణతో బతుకమ్మ ఉత్సవాలు ముగిసాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *