లండన్ లో అట్టహాసంగా TAUK 2వ ఆవిర్భావ మరియు 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • January 28, 2019 11:21 am

శనివారం లండన్ నగరంలోని హౌన్సలో పట్టణంలో తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) రెండవ ఆవిర్భావ వేడుకలు మరియు గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు యూకె నలుమూలల నుండి తెలంగాణ బిడ్డలు, ప్రవాస భారతీయులు, అభిమానులు హాజరయ్యారు.

మొదటగా 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ చేసారు. ఆ తర్వాత అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది మాట్లాడుతూ
యావత్తు దేశ ప్రజలు ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని పండుగగా జరుపుకుంటున్న ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమర వీరులను, త్యాగమూర్తులను స్మరించుకున్నారు.

ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం మాట్లాడుతూ భారతీయతే మనకు ప్రథమం అనే సందేశాన్ని తీసుకెళ్లే దిశగా నేడు ‘టాక్’ సంస్థ రెండవ ఆవిర్భావ వేడుకల సందర్బంగా ముందు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకం ఎగరవేసుకోవడం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, ఈ సందర్బంగా టాక్ కార్యవర్గాన్ని అభినందించారు.

సంయుక్త కార్యదర్శి నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనమందరం కృషి చేద్దాం అని అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలవారికీ సమంగా అందాలనీ బాధ్యత గల పౌరులుగా మనమందరం సమిష్ఠిగా శ్రమించి మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన ఉజ్వల భారతాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో అహర్నిశం, అనుక్షణం కృషి చేద్దాం అని పేర్కొన్నారు.

అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ మట్టా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో లండన్ నగరంలోని గల్లీ, గల్లీలో తెలంగాణ జెండా మోసి, రాష్ట్రం ఏర్పాటు అయ్యేవరకు పోరాటం చేసిన ఎంతో మంది ఉద్యమ బిడ్డలతో కలిసి ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా వుంది అని అన్నారు.

టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం, బోర్డు వైస్ చైర్మన్ మట్టా రెడ్డి, సంయుక్త కార్యదర్శి నవీన్ రెడ్డి కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర,సత్య చిలుముల, రవి ప్రదీప్ పులుసు, రంజిత్ చాతరాజు, రాకేష్ పటేల్, సురేష్ బుడగం, వంశీ పొన్నం, మహేందర్, రామారావు, రాజేష్ వాకా, రవీందర్ రెడ్డి మహిళా విభాగం సభ్యులు సుప్రజ పులుసు, క్రాంతి రేటినేని, శ్రీ లక్ష్మి, శ్వేతా మహేందర్, విజిత తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.


Connect with us

Videos

MORE