జక్రాన్‌పల్లికి ఎయిర్ పోర్ట్- కల్వకుంట్ల కవిత

  • April 4, 2019 4:57 pm

జక్రాన్‌పల్లిలో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచార సభలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీమతి కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జక్రాన్‌పల్లికి ఎయిర్ పోర్టు రాబోతుందని, ఇందుకోసం 800 ఎకరాల భూమిని చూశామని తెలిపారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రానున్న తరాలకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఏ ఆధారం లేని ప్రజల కోసం వందశాతం సబ్సిడీ కింద రూ. 50 వేలు రుణాలు ఇచ్చామని ఆమె గుర్తుచేశారు. పీఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులందరికీ మే నెల నుండి రూ. 2 వేలు పించన్ ఇస్తామని, డ్వాక్రా గ్రూపుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేయిస్తామని కవిత హామీ ఇచ్చారు.

రెండవసారి కేసీఆర్ గారిని సీఎం చేసినందుకు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదని, మళ్ళీ ఎంపీగా తనను గెలిపిస్తే శక్తి వంచన లేకుండా పనిచేస్తాను అని పేర్కొన్నారు. ఈ సారి ఎక్కువమంది పోటీలో ఉన్నారు. మొదటి ఈవీఎంలో రెండవ నంబరు మీద కారు గుర్తు ఉంటుంది. అది గమనించి ఓటేయాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు.


Connect with us

Videos

MORE