మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైటా) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పూల జాతరకు మలేషియా పరవశించింది. కౌలాలంపూర్ లిటిల్ ఇండియా లోని SMK La Salle, స్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ వాసులు భారీగా తరలి వచ్చారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా గారు, తుంగతూర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్ గారు, ఇండియన్ హై కమిషనర్ అఫ్ మలేషియా టిఎస్ తిరుమూర్తి గారు, మలేషియా తెలుగు సంగం ప్రెసిడెంట్ Dr అచ్చయ్య కుమార్ రావు గారు పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో మహిళలు, చిన్నారులు బతుకమ్మలను అక్కడ దొరికె రంగు రంగుల పువ్వులతో అందంగా పేర్చారు అనంతరం పసుపు తో గౌరమ్మను తయారు చేసి కుంకుమ పెట్టి బతుకమ్మలకు అగరవత్తులు వెలిగించిన తరువాత ఆడి పాడి సందడి చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మా, ఒక్కొక్క పువ్వేసి చందమామ, ఒక్క జాము అయై చందమామ, వంటి పాటలతో మలేషియా మారుమోగింది. తెలంగాణ కళాకారుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అందంగా అలంకరించిన బతుకమ్మలకు ఈ సందర్భంగా మైటా 6గ్రాముల బంగారం బహుమతులు అందజేశారు. ఈ ఉత్సవాలలో ప్రవాస తెలంగాణ వాసుల కుటుంబాలే కాకుండా మలేషియా దేశస్థులు కూడా హాజరు కావడం విశేషం. ఈ కార్యక్రమానికి దాదాపు రెండు వేల మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా గారు తెలంగాణ ఆడపడుచులతో బతుకమ్మ, కోలాటం ఉత్సహాంగా ఆడి పాడి సందడి చేశారు. సొంత ప్రాంతాలకు దూరంగా వున్నా మలేషియా లో బతుకమ్మను ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
నునిత గారు మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ వాసులు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మ సంబరాలు మరియు తెలంగాణ పండుగలు జరుపోకోవడం చాల సంతోషంగ ఉందన్నారు. ఈ సంబరాలను ఘనంగా నిర్వహించిన మలేషియా తెలంగాణ అసోసియేషన్ ను అభినందించారు.
మైటా ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ సంవత్సరం ఐదు రోజుల పాటు తెలుగు వారు వుండే ప్రతి చోట బతుకమ్మ వేడుకలను మన సంస్కృతికి అద్దం పట్టేలా ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వచ్చిన JSR గ్రూప్ సన్ సిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయడానికి సహకరించిన మైటా కోర్ కమిటీని వాలంటీర్లుగా ముందుకి వచ్చిన సభ్యులను అయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి వైస్ ప్రెసిడెంట్ చోపరి సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు రవి వర్మ, చిట్టి, రఘు, బూరెడ్డి మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రవి చంద్ర, కృష్ణ వర్మ, స్టాలిన్, చందు, కిరణ్మయి, శిరీష, అమర్నాథ్, శాంతి ప్రియ, ఎబినైజర్. ఈవెంట్ మానేజ్మెంట్ కమిటీ రమణ, వేణు గోపాల్, కార్తీక్, శివ, శశి, ప్రసాద్, కిరణ్ గౌడ్, నరేందర్ అజయ్ కుమార్, ప్రభాకర్, రంజిత్, అనిల్, సుందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.