మే 2008లో వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును తెలంగాణపై నిలదీసిన రైతుకూలి ఫణికర మల్లయ్యను నిన్న వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.
రేపు పరకాలలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటనకు చేస్తున్న విస్తృత బందోబస్తులో భాగంగా నిన్న రాయపర్తిలోని ఫణికర మల్లయ్య ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి అటుపై ఆర్డీవో ముందు బైండోవర్ చేశారు.
ఏ రాజకీయాలూ లేని ఫణికర మల్లయ్య లాంటి పేద రైతుకూలిని కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అభద్త్రతాభావంతో ఉన్నదో మరో సారి నిరూపితమయ్యింది.