60 ఏళ్ల తెలంగాణ కొట్లాడి మరీ సాధించుకున్నాం.. ఎన్నో బలిదానాలు చేశాం. మరెన్నో త్యాగాలు చేశాం.. ఇంకెన్నో పోరాటాలు, లెక్కలేనన్ని అవమానాలు.. 60 ఏళ్ల బానిస బతుకులను చరమగీతం పలికాం. అధికారంలోకి వచ్చిన వెంటనే హస్తిన నేతలకు వినిపించేలా తెలంగాణ ఆత్మగౌరవ నినాదాన్ని వినిపించాం. ఏడాది గడిచిందో లేదో.. ఆంధ్రోళ్ల అహంకారాన్ని, దురాగతాలను, అధికార అమరావతి కరకట్టలపైకి తరిమాం.. ఐదేళ్లు కాలరెగరేసుకుని బతుకమ్మ పాటలు పాడుకున్నాం.. దసరా సంబురాలు చేసుకున్నాం.. కాకతీయుల పాలన స్ఫూర్తిగా గొలుసు చెరువులకు శ్రీకారం చుట్టాం.. భగీరధతో ఇంటింటికీ కుళాయిలను తిప్పుకున్నాం.. ఇదీ తెలంగాణ యువత మనోగతం..
ఐదేళ్లు గడవక ముందే మరోసారి అదే బానిస బతుకు బతకాలా కోదండరామ్ సార్.. అని తెలంగాణ యువకులు గొంతెత్తి దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నారు. ఎల్.రమణకు బానిసత్వం రక్తంలో ఇంకిపోయింది.. ఆయన ఎర్ర రక్తకణాలు ఎన్టీఆర్ భవన్‌లో ఊడిగం చేసి పసుపు కణాలుగా మారిపోయాయని టీఆర్‌ఎస్ నేతలతోపాటు గతంలో మీరే విమర్శించారు.. ఇక, కాంగ్రెసోళ్లకు టెన్‌జన్ పథ్ చుట్టూ ప్రదక్షిణలు చేయడం, వారి ముందు సాగిల పడడం వారి బానిస మనస్తత్వాలకు అలవాటయిపోయింది. వారి వెన్ను ఎప్పుడో వంగి పోయింది సలాములు కొట్టి కొట్టి.. తెలంగాణను విముక్తి చేసి, మాకు స్వేచ్ఛా వాయువులు అందించిన మీరు మరోసారి అమరావతి నుంచి వచ్చే ఆర్డర్స్ కోసం ఎదురు చూసేలా చేస్తారా..?? లేక ఢిల్లీ నుంచి ఊడిపడే సీల్డ్ కవర్ సీఎంల కింద పని చేసి.. మరోసారి మా స్వాతంత్ర్యాని హరిస్తారా.? ఏం చేయమంటారు ప్రొఫెసర్ గారూ.. మీరు మరోసారి తెలంగాణ పాఠాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది.. మన చరిత్ర, స్వాతంత్ర్యమును మళ్లీ మీరు గుర్తు చేయాల్సిన టైమ్ అయిదేళ్లకో వస్తుందనుకోలేదు.
ప్రొఫెసర్ గారు.. సారీ నన్ను క్షమించండి.. ఈ మాట అంటున్నందుకు.. మీకే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, జ్వాలను కళ్లముందు గుర్తు చేయాల్సి వస్తోంది.. ఆ బానిస బతుకులు మనకు అవసరమా..? కావాలంటే ఆ కాంగ్రెసోళ్లతో పొత్తు వద్దు.. అమరావతి బాస్‌ల హుంకరింపులు అవసరం లేదు. మీరు రాజకీయంగా బలపడాలంటే మీరే సొంతంగా అన్ని స్థానాలలో పోటీ చేయండి.. మీ వెనక మేముంటాం.. ఆంధ్రాబాబులు అసెంబ్లీ సాక్షిగా ఒక్క పైసా విదల్చం ఏం చేసుకుంటారో చేసుకోండి అని హుంకరించినందుకు వారికి బొంద పెట్టాం.. వారి ముక్కు నేలకు రాయించాం.. అందుకే, మన సంస్కృతిని, చరిత్రను బస్సు, మెస్సు, ప్రెస్సు వేసుకుని వచ్చి రామోజీ ఫిలిం సిటీ సాక్షిగా మాకు అన్యాయం చేసినందుకు.. చార్మినార్ సంస్కృతిని నాశనం చేసినందుకు..
మీ పాదాలకు నమస్కరించి రాస్తున్నాను కోదండరామ్ ప్రొఫెసర్ గారు. నాడు హస్తిన పెద్దల గుండెల్లో ఫిరంగులు మోగించడానికి, వారికి షరతులు విధించడానికి మీరు ఢిల్లీ వెళ్లారు. నేడు అక్కడికి నాలుగు సీట్ల కోసం వెళ్లడం బాధ కలిగిస్తోంది. ఇది మీకు న్యాయమా..? ఇప్పటికీ మీరు అదే కుటుంబం ముందు చేతులు కట్టుకోవడం మాకు బాధేస్తోంది.. మీరు ఒక్కసారి ఆలోచించండి.. మా బాధను మీ ముందుంచుతున్నాం..
ఇట్లు..
హస్తిన, అమరావతి బానిస బతుకులు వద్దని విన్నవించుకుంటున్న ఓ యువకుడు
జై తెలంగాణ.. జై జై తెలంగాణ