మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకునేది లేదంటూ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు.
పర్మిషన్లు ఇచ్చి కరెంట్ బిల్లులు, ఇంటిపన్నులు కట్టించుకున్న కాంగ్రెస్ వాళ్లే పేదలను కబ్జాదారులనటం దారుణమని మండిపడ్డారు. బాధితులు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ ధైర్యం చెప్పారు.
మూసీ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ తమ ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తోందని.. తమకు అండగా ఉండాలంటూ తెలంగాణ భవన్ కు వచ్చిన బాధితులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా బాధితులందరికీ న్యాయ సాయం బీఆర్ఎస్ పార్టీయే చేస్తుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ప్రజలకు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు పేద ప్రజల ఇళ్లను గుంజుకుంటుందని మండిపడ్డారు. బాధితులందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ఎవ్వరూ ఆధైర్య పడవద్దని వారికి భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం తమ ఇళ్లను కూలగొడతామంటూ ఇబ్బంది పెడుతోందంటూ బాధితులు కేటీఆర్కు తమ ఆవేదన చెప్పుకున్నారు. 50 ఏళ్లుగా మూసీ పరివాహాక ప్రాంతంలో ఉంటున్న తమ ఇళ్లను కూల్చివేస్తామంటే ఎక్కడికి వెళ్లేదంటూ వాపోయారు. పేద ప్రజల ఇళ్లను ఇష్టానుసారంగా కూల్చేస్తామంటే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
బాధితులకు ఏ సమస్య వచ్చినా సరే బీఆర్ఎస్ స్థానిక నాయకులను సంప్రదించాలన్నారు. అదే విధంగా మీరు గెలిపించిన ప్రజాప్రతినిధులను కూడా నిలదీయాలని వారికి సూచించారు. ఈ సందర్బంగా తమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్కు మూసీ బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
- Congress’s top brass remain silent on non-implementation of 6 guarantees
- Decision to convert TIMS into Sports Village sparks public outrage
- Police Act enforced in 20 districts; Is Telangana turning into a ‘Police State’?
- Fact Check: Congress government didn’t increase diet charges by 40%
- Local bodies to lose relevance with HYDRAA’s excessive powers
- తెలంగాణలో జరగుతున్న అరాచక పాలనపై రాహుల్ గాంధీ సమీక్ష చేయాలి: హరీష్ రావు
- గాంధీ భవన్కు కాదు.. ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ముందా?: రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
- మంచి పనులు చేసిన సర్పంచులకు రేవంత్ రెడ్డి శిక్ష వేస్తున్నాడు: హరీష్ రావు
- సర్పంచుల కుటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా?: కేటీఆర్
- రేవంత్ రెడ్డికి రైతుల ఓట్లు కావాలి.. కానీ రైతుల వడ్లు పట్టవు: హరీష్ రావు
- హెచ్ఎండీఏ పరిధిలోని జీపీ లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు బంద్ పెట్టడం మూర్ఖపు చర్య: కేటీఆర్
- హామీల అమలు విషయంలో రాష్ట్ర, దేశ ప్రజలను రేవంత్ తప్పుదోవ పట్టిస్తునాడు: హరీష్ రావు
- పదేళ్లు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్న తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి: కేటీఆర్
- పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర: కేటీఆర్
- తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు