mt_logo

తెలంగాణలో ఎక్కడుంది అభివృద్ధి- ప్రొ.కోదండరాం

తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మెదక్ లో టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రారంభించారు. తెలంగాణ రైతులపై సీఎం కురిపిస్తున్న మొసలికన్నీరును చూసి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. తెలంగాణ రైతులు అప్పులుచేసి బోర్లువేసుకుంటున్నారని, అప్పులకు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం మాత్రం బోరుబావులతో తెలంగాణ ప్రాంత అభివృద్ధి జరిగిందని అసత్యాలు మాట్లాడుతున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం పాలనలో కట్టిన ప్రాజెక్టులకు సిమెంట్ లైనింగ్, చివరి ఆయకట్టు భూములకు నీరివ్వకుండా ప్రభుత్వం చేస్తుందని, ఇప్పటి ప్రభుత్వం కంటే అప్పటి నిజాం పాలనే బాగుందని అన్నారు. నిజాం కట్టిన ప్రాజెక్టులద్వారానే ఇప్పటికీ తెలంగాణలోని రైతులకు సాగునీరు అందుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించేలా పోరాడుదామని సూచించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు జీవో 421 క్రింద నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొ.హరగోపాల్, తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు, టీఆర్ఎస్ నేత దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *