mt_logo

తెలంగాణ బిల్లుకు మద్దతు ఇస్తాం-శరద్ పవార్

తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు సహకరించాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కోరారు. అందుకు ఆయన తమ పార్టీ తెలంగాణకు మద్దతు తెలుపుతుందని చెప్పారు. మొదటినుండీ ఎన్సీపీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తూనే ఉందని, తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వచ్చిన సందర్భంలోనూ ఆమోదం తెలపాలని పవార్ ను కోరినట్లు కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. యూపీఏ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు తెలంగాణ బిల్లుకు సహకరించాలని శరద్ పవార్ ను కేసీఆర్ కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదేరోజు పవార్ ను కలవడం జరిగింది. టీడీపీ తెలంగాణ విషయంలో సరైన స్పష్టత ఇవ్వకపోవడాన్ని శరద్ పవార్ ప్రశ్నించారని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *